గోల్కొండ అమ్మవారికి భక్తి శ్రద్దలతో బోనాలు
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి తొలిబోనం
హైదరాబాద్: నగరంలో ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరం అమ్మవార్ల నామస్మరణతో మారుమోగుతోంది. నగరంలో పూర్తిగా ఆధ్యాత్మికత చోటు చేసుకుంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నగరవాసులు రెండవ ఆదివారం మహిళలు భక్తి శ్రద్దలతో బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు ఏలాంటి ఇబ్బందులు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డప్పు చప్పుళ్ల మధ్య శివసత్తులు, పోతరాజుల నృత్యాలతో గోల్కొండ ఖిలా మారు మోగింది. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు గొల్కోడ కోట నుంచే ప్రారంభమై ఇక్కడి చివరి బోనం( అగస్టు 8వ తేది)తో ముగయనున్న విషయం తెలిసిందే.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం…
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. ఈనెల 25న నిర్వహించనున్న అమ్మవారి బోనాల పండుగ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమైయ్యాయి. గత ఆదివారం నుంచి అమ్మవారి ఘటం ఎదుర్కొలు కార్యక్రమం కొనసాగుతుండగా ఈ ఆదివారం మహంకాళి అమ్మవారి తొలి బోనం సమర్పించారు. తొలిబోనం ఎత్తుకున్న శ్యామల తన నృత్యాలతో ఆకట్టుకున్నారు. డప్పు చప్ఫుళ్లు, బజా భజంత్రిలతో పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.