Friday, November 22, 2024

పంజాబ్ పిసిసి చీఫ్‌గా సిద్ధూ

- Advertisement -
- Advertisement -

Navjot Singh Sidhu appointed as Punjab Congress Chief

న్యూఢిల్లీ /చండీగఢ్: పంజాబ్ పిసిసి అధ్యక్షులుగా మాజీ మంత్రి నవ్‌జోత్ సింగ్ సిద్దూ నియమితులు అయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు, సిద్ధూకు మధ్య తీవ్రస్థాయి అభిప్రాయభేదాలు కొనసాగుతున్న దశలోనే ఆదివారం ఈ నియామకం జరిగింది. రాష్ట్ర కేబినెట్ మంత్రిగా సిద్ధూ ఇప్పటివరకూ ఉన్నారు. సిద్ధూను పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటన వెలువరించారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, సిద్ధూతో అధిష్టానం వేర్వేరుగా వరుస భేటీలు నిర్వహించిన తరువాత సిద్ధూ నియామక ప్రకటన వెలువడింది. కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన తరువాత సిఎం అమరీందర్ ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపినట్లు వెల్లడైంది. ఆదివారం ఉదయం పంజాబ్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో, నేతలతో సిద్ధూ తన నివాసంలో భేటీ కావడం ఇదే దశలో పలువురు కాంగ్రెస్ ఎంపిలు ఈ వ్యవహారం గురించి సోనియాతో మాట్లాడేందుకు అవకాశానికి యత్నించడం వంటి పరిణామాలు జరిగాయి.

సిద్ధూను పిసిసి నేతగా ప్రకటించడం తగదని చెప్పేందుకు వారు యత్నించారు. పార్టీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించారు. పిసిసి పంజాబ్ విభాగంలో సమతూకత పాటించేందుకు అన్ని వర్గాలను సంతృప్తిపర్చేందుకు ఈ విధంగా ఏర్పాట్లు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ పి పిసిసి నేతగా ఉన్న సునీల్ జక్కర్ సేవలను పార్టీ ప్రశంసించింది. సిద్ధూకు అవకాశం కల్పిస్తూ సునీల్ బాధ్యతల నుంచి వైదొలిగారు. మరో వైపు తాను అమరీందర్ నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడుతానని సిద్ధూ చెప్పారు. తనకు సిద్ధూపై అసమ్మతి ఏమీ లేదని సిఎం తెలిపారు. కానీ గతంలో తనకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కల్గించాయని, వీటిని ఉపసంహరించుకోవడమో లేదా క్షమాపణ చెప్పడమో చేయాల్సి ఉంటుందని సన్నిహితుల వద్ద క్యాప్టెన్ చెప్పినట్లు తెలిసింది.

Navjot Singh Sidhu appointed as Punjab Congress Chief

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News