ముంబయి: కన్నబిడ్డను కళ్లేదుటే చిరుత పులి ఎత్తుకెళ్లుతుంటే చిరుతతో తల్లి పోరాడి కూతురును దక్కించుకున్న సంఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జునానా గ్రామంలో అర్చన్ మేశ్రమ్ అనే మహిళ తన ఐదేళ్ల కూతురు ప్రజెక్తతో కలిసి జీవిస్తోంది. జులై 1న తన కుమార్తెను తీసుకొని బహిర్భూమికి వెళ్లింది. పొదల్లో ఉన్న చిరుత కూతురుపై దాడి చేసింది. వెంటనే తేరుకున్న మహిళ చిరుతపై కర్రతో దాడి చేయడానికి ప్రయత్నించింది. చిరుత బాలికను వదిలి మహిళపై దూకింది. అలా చిరుతతో మహిళ పోరాడడంతో అది తోక ముడిచిపారిపోయింది. తీవ్రంగా గాయపడిన మహిళ, ఆమె కూతురును గ్రామస్థులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం వారిని నాగపూర్ ఆస్పత్రికి తరలించారు. దవడ పైభాగంలో పాపకు ఎముక విరగడంతో పాటు కనురెప్ప కూడా మూతపడటంలేదని వైద్యులు తెలిపారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
కన్నబిడ్డను కాపాడడం కోసం చిరుతతో పోరాడిన మహిళ
- Advertisement -
- Advertisement -
- Advertisement -