Friday, September 20, 2024

‘రామారావు ఆన్ డ్యూటీ’లో చేరిన రాజీషా

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. రవితేజ కెరీర్‌లో 68వ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్ వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా శరత్ మండవ దర్శకునిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి మరింత పెరగడంతో పాటుగా అంచనాలు కూడా పెరిగాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో రామారావుగా ఒక్క రవితేజ క్యారెక్టరే కాదు ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంది. కథానుగుణంగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది.

‘మజలీ’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దివ్యాంశ కౌశిక్ ఇప్పటికే ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాలోని మరో ప్రధానమైన హీరోయిన్ పాత్రకు మలయాళ నటి రాజీషా విజయన్‌ను చిత్రబృందం ఎంపిక చేసుకుంది. రాజీషకు తెలుగులో రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ తొలి చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ డిఫరెంట్ థ్రిల్లర్ కోసం ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.

https://www.instagram.com/p/CRf44ohr2IY/?utm_source=ig_embed&ig_rid=774be21a-db83-409a-82e5-bce027c82e68

Rajisha Vijayan debut with ‘Rama Rao On Duty’ movie

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News