- Advertisement -
హైదరాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకూ, ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ఈ బక్రీద్ పండుగ ఒకటని అన్నారు. ఈ పండుగ త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బక్రీద్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
కరోనా నేపథ్యంలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ నుంచి మక్కాకు హజ్ యాత్రకు వెళ్లలేకపోవడం బాధాకరమన్నారు. అల్లా దయతో కరోనా అనే సైతాన్ ను తరిమెద్దామన్నారు. రేపు జరిగే బక్రీద్ పండుగ రోజున ముస్లిం సోదరులు కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఎవరి ఇంటి వద్ద వారే తెలంగాణ ప్రజలు సంతోషంతో పాటు సుభిక్షంగా వుండాలని ప్రార్థన చేయాలని పిలుపునిచ్చారు.
- Advertisement -