హైదరాబాద్: దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఎస్ఐతోపాటు ఇద్దురు కానిస్టేబుళ్లను రాచకొండ కమిషనరేట్ విధుల నుంచి తొలగించింది. ఖమ్మం జిల్లాలోని అడ్డగూడురు పోలీస్ స్టేషన్‌లో కస్టడీలో ఉన్న దళిత మహిళ మరియమ్మ ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో విచారణకు ఆదేశించిప ప్రభుత్వం.. మరియమ్మ లాకప్ డెత్ కు బాధ్యులైన ఎస్ఐ మహేశ్వర్, కానిస్టేబుళ్లు రషీద్ పటేల్, జానయ్యలను సస్పెండ్ చేశారు. ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించిన పోలీసు ఉన్నతాధికారులు తప్పు జరిగినట్లుగా తేల్చారు. దీంతో ఎస్ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ బుధవారం తెలిపారు. ఈ మేరకు ఎస్ఐ వి మహేశ్వర్, కానిస్టేబుల్స్ ఎంఏ రషీద్ పటేల్, పి జానయ్యను రాజ్యంగంలోని ఆర్టికల్ 311(2)(b), 25(2) ప్రకారం విధుల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
Mariamma death case: SI and 2 Constables dismissed