- Advertisement -
కోల్‌కతా: ప్రత్యర్థులపై నిఘా కోసం కేంద్రం భారీగా ఖర్చు చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తిని బిజెపి కాల రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం కాకుండా పెగాసస్ కోసం కేంద్రం ఖర్చులు చేస్తోందని, ఆగస్టు 16న ఖేలా దివస్ నిర్వహిస్తామన్నారు. మీడియా, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ అంటేనే ప్రజాస్వామ్యం అని, ఈ మూడింటిని పెగాసస్ ఖూనీ చేసిందని దుయ్యబట్టారు. అన్ని వ్యవస్థలను మోడీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. ప్రస్తుతం న్యాయం వ్యవస్థ మాత్రమే దేశాన్ని కాపాడాగలదన్నారు.
- Advertisement -