Friday, November 15, 2024

యుపిలో వర్ష బీభత్సం: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Seven killed in rain-related incidents in UP

లక్నో: ఉత్తరప్రదేశ్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు వేర్వేరు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. గత 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో మూడు వేర్వేరు సంఘటనల్లో ఒక శిశువుతో సహా ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారని జిల్లా అధికారులు బుధవారం తెలిపారు. ఈ ఘటనలపై సీతాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ విశాల్ భరద్వాజ్ మాట్లాడుతూ… మన్పూర్ ప్రాంతంలో గోడపై పడటంతో మూడు నెలల చిన్నారితో సహా ఒక కుటుంబంలో నలుగురు మరణించారు. ఇలాంటి సంఘటనలో ఒక జంట, ఒక వృద్ధుడు మృతిచెందారు. క్షతగాత్రులను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్చారు.

గాయపడిన వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితులకు ఉచిత వైద్య చికిత్స అందించాలని, మరణించిన వారి బంధువులకుపరిహారం చెల్లించే ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ మూడు సంఘటనలు మంగళవారం, బుధవారం మధ్య రాత్రి జరిగాయి. లక్నోకు ఉత్తరాన 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతాపూర్‌లో మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 గంటల మధ్య 4.1 సెం.మీ వర్షపాతం నమోదైందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో ఎక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేస్తూ జిల్లా విపత్తు నిర్వహణ బృందాన్ని అప్రమత్తం చేసామని అధికారులు తెలిపారు.

Seven killed in rain-related incidents in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News