- Advertisement -
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని సంజయ్ గాంధీ పిజి వైద్య శాస్త్రాల సంస్థ బుధవారం తెలిపింది. వైద్య నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఆసుపత్రిని సందర్శించి కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరితంగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. 89 ఏళ్ల కల్యాణ్ సింగ్ గతంలో రాజస్థాన్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. జులై 4న ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలోని ఐసియులో చేరిన కల్యాణ్ సింగ్ క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
- Advertisement -