Monday, November 25, 2024

కోవిడ్ పోయినట్లే.. డెల్టాతో తిరిగొచ్చినట్లే

- Advertisement -
- Advertisement -

US must stay vigilant about Delta variant:Biden

 

అమెరికా అధ్యక్షులు జో బైడెన్
టీకాలతో మనం పూర్తి సేఫ్
6 నెలల అధికార దశలో విశ్లేషణ

వాషింగ్టన్ : అమెరికాలో కోవిడ్ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, అయితే డెల్టా వేరియంట్‌తో జాగ్రత్తగా ఉండాలని దేశాధ్యక్షులు జో బైడెన్ హెచ్చరించారు. ఇటీవలి కాలంలో కోవిడ్‌తో మరణాలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఇది అనుకున్న దాని కన్నా ఎక్కువ సంఖ్యలో ఉంది. ఇది చాలా కీలకమైన , సంతోషించదగ్గ విషయం. అంతేకాకుండా విస్మయకరం కూడా. వ్యాక్సినేషన్ల విజయవంతంతోనే ఈ తగ్గుదల ఉందని తెలిపారు. అయితే ఇంతటితో వైరస్ ముప్పు ముగిసిందని అనుకోరాదని, కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్ పట్ల జనం జాగరూకతతో ఉండాలని కోరారు. ప్రజలు వెంటనే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లకు దిగాలని పిలుపు నిచ్చారు. టీకాలు వేయించుకోని వారు, కోవిడ్‌తో ఆసుపత్రులలో చేరుతున్న వారిలోదాదాపుగా అంతా కూడా టీకాలు వేయించుకోకుండా ఉన్నవారే అని తెలిపారు.

ఇండియాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియంట్ లేదా బి 1.617.2 తరువాత ఇతర దేశాలకు, అమెరికాకు వ్యాపించిందని ప్రచారం జరుగుతోంది. దేశంలో ఇప్పుడు తలెత్తిన కొత్త కరోనా కేసులలో దాదాపు 80 శాతం వరకూ డెల్టా వేరియంట్‌తో వచ్చినవే అని వెల్లడికావడంతో డెల్టా వైరస్ పట్ల అమెరికాలో భయాలు ముమ్మరం అయ్యాయి. తాను అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి అయిన తరుణంలో జో బైడెన్ తమ కేబినెట్ సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ తగ్గుముఖం పట్టింది. అయితే అజాగ్రత్తలతో ముప్పు వాటిల్లుతుందని అందరికీ ఇదే తన హెచ్చరిక అని తెలిపారు. ఇప్పుడు టీకాలు అత్యంత కీలక ప్రక్రియలో భాగం అని, వ్యాక్సిన్లు వేసుకోని వారికి వ్యాక్సిన్లు వేసే దశలో ఉన్నామని, ఇది పూర్తయితే డెల్టా ఇతర ముప్పులను కూడా నివారించుకుని తీరుతామని తెలిపారు. టీకాలు వేయించుకోవడమే సురక్షిత మార్గం అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News