ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్
గౌహతి: సిఎఎ, ఎన్ఆర్సి వల్ల భారతీయ ముస్లింలకు ఎలాంటి నష్టం జరగదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ అన్నారు. రాజకీయ మైలేజీ కోసమే కొందరు దీనిని హిందూముస్లిం అంశంగా చేస్తున్నారని ఆయన విమర్శించారు. అసోం రాజధాని గౌహతిలో సిఎఎ,ఎన్ఆర్సిపై ప్రొఫెసర్ నానీగోపాల్ మహంత రాసిన పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా భగవత్ ప్రసంగించారు. దేశ విభజన తర్వాత రెండు దేశాల్లోని మైనార్టీలకు రక్షణ కల్పించేందుకు హామీ ఇస్తూ నెహ్రూలియాఖత్ ఒప్పందం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అయితే, ఒప్పందానికి కట్టుబడి భారత్‌లోని మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నామని, పాకిస్థాన్ మాత్రం హామీని నిలబెట్టుకోలేదని భగవత్ విమర్శించారు. సిఎఎ,ఎన్ఆర్సి రాజ్యాంగానికి విరుద్ధం కాదని ఆయన స్పష్టం చేశారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం గురించి ఇతర దేశాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం భారత్‌కు లేదని, 4000 ఏళ్లుగా భారత్ అవే సంప్రదాయాలను పాటిస్తున్నదని భగవత్ అన్నారు. పుస్తకావిష్కరణకు అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వశర్మ కూడా హాజరయ్యారు.