- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదీ ఉప్పొంగుతోంది. ఈ క్రమంలోనే భద్రాద్రి దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఉదయం నుంచి భద్రాద్రి వద్ద భారీగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో, పర్ణశాలలో స్వామివారి నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. వరద ప్రవాహం క్రమంగా పెరగడంతో సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
heavy water inflow in Godavari at Bhadradri
- Advertisement -