Saturday, November 23, 2024

అప్రమత్తంగా ఉండండి: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister ktr review on heavy rains in telangana

పురపాలక శాఖ ఉన్నతాధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశాలు

హైదరాబాద్ : గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి కె. తారకరామారావు కోరారు. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ లో నెలకొన్న భారీ వర్షాల వలన ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు సమీక్షించాలని అరవింద్ కుమార్‌ను ఆదేశించారు. ఇప్పటికే నిర్మల్ వంటి చోట్ల భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో జరుగుతున్న సహాయక చర్యలు పైన స్థానిక జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

దీంతోపాటు హైదరాబాద్ నగరం లో మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్‌ఎంసి యంత్రాంగం సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో పనిచేసే డిజాస్టర్ రెస్పాన్స్ దళం సైతం అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేంత వరకు అధికారులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పురపాలక శాఖ యంత్రాంగానికి మంత్రి కెటిఆర్ సూచించారు. పాత భవనాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పౌరులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతే వారందరిని సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News