చివరి వన్డేలో భారత్ ఓటమి
కొలంబో: భారత్‌తో శుక్రవారం జరిగిన మూడో చివరి వన్డేలో ఆతిథ్య శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా టీమిండియా 21తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. వర్షం వల్ల మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 43.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగింది. ఏకంగా నలుగురు కొత్త ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లంక బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ పృథ్వీషా 8 ఫోర్లతో 49 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సంజు శాంసన్ ఐదు ఫోర్లు, సిక్స్‌తో 46 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ 40 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టులో ధనంజయ, జయవిక్రమ మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక 39 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (76), భానుక రాజపక్సా (65) కీలక ఇన్నింగ్స్‌తో లంకను గెలిపించారు.