- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ 200 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ను బంగ్లాదేశ్ కు సరఫరా చేసింది. భారతీయ రైల్వేల ఆధ్వరంలో నడుస్తున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు శనివారం జార్ఖండ్‌లోని టాటానగర్ నుంచి బయలుదేరింది. ఆదివారం నాడు ఈ రైలు బంగ్లాదేశ్‌లోని బెనాపోల్‌కు చేరుకుంటుంది. పొరుగు దేశానికి రైలు ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయడం ఇదే మొదటి సారి. ఈ రైళ్లను ఏప్రిల్ 24,2021న ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో 480 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అప్పటి నుండి దేశవ్యాప్తంగా 36,841 టన్నుల ఆక్సిజన్‌ను తీసుకువెళ్లాయి. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో, రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్నప్పుడు, రైల్వేలు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపడం ప్రారంభించాయి.
India to deliver 200 tonnes oxygen to Bangladesh
- Advertisement -