Friday, November 22, 2024

కౌన్ బనేగా కరోడ్‌పతి పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

Kaun banega crorepati fraud in Jeedimetla

రూ.25లక్షలు వచ్చాయని రూ.8లక్షలు వసూలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

హైదరాబాద్: పాపులర్ ప్రొగ్రాం కౌన్ బనేగా కరోడ్‌పతి పేరు చెప్పి ఓ బాధితురాలిని సైబర్ నేరస్థులు నిండాముంచారు. ఇందులో బహుమతిగా రూ.25లక్షలు వచ్చాయని చెప్పి దశల వారీగా రూ.8లక్షలు వసూలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌కు చెందిన గాయత్రి అనే మహిళకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. కౌన్ బనేగా కరోడ్‌పతిలో మీకు రూ.25లక్షలు గిఫ్ట్ వచ్చాయని చెప్పాడు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు సైబర్ నేరస్థులు చెప్పినట్లు చేసింది. గిఫ్ట్‌గా వచ్చిన రూ.25లక్షలు ఇవ్వాలంటే వివిధ ఛార్జీలు చెల్లించాలని చెప్పారు. దీనికి అంగీకరించిన బాధితురాలు దశలవారీగా సైబర్ నేరస్థులు చెప్పినట్లు వారి బ్యాంక్ ఖాతాలకు రూ.8లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. తర్వాత కొద్ది రోజులకు నిందితుల మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ బాలరాజు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News