Saturday, November 23, 2024

అందరివాడు కోవిందుడు

- Advertisement -
- Advertisement -
President Ram Nath Kovind completes four years
రాష్ట్రపతిగా 4 ఏండ్లు పూర్తి

న్యూఢిల్లీ: దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవిలోకి వచ్చి ఆదివారంతో నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్రపతిభవన్ వెలువరించిన ప్రకటనలో తెలిపారు. రాష్ట్రపతి కోవింద్ ఈ నాలుగేళ్ల కాలంలో 63 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్లకు స్ఫూర్తినిస్తూ, దేశంలో ఎందరో కోవిడ్ బారి నుంచి బయటపడేలా చేసేందుకు తమ బాధ్యతను నిర్వర్తించారని తెలిపారు. అందరివాడైన రాష్ట్రపతి 76 సంవత్సరాల కోవింద్ ఇప్పటికీ13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో పర్యటించారు.

ఆయా సందర్భాలలో దాదాపు 780 మందిని కలిశారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ విధంగా జనానికి చేరువ అయ్యారు. దేశానికి 14వ రాష్ట్రపతిగా కోవింద్ 2017 జులై 25వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. దేశ రాజ్యాంగానికి పరిరక్షకుడిగా వ్యవహరించే రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఎట్ హోం కార్యక్రమానికి కొందరు ఫ్రంట్‌లైన్ కరోనా వర్కర్లను ఆహ్వానించారు. వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా పరిగణించి దేశంలో కరోనాపై పోరులో వారు జరుపుతున్న క్షేత్రస్థాయి అంకితభావపు విధి నిర్వహణను ప్రస్తావించారని రాష్ట్రపతిభవన్ ఇ బుక్‌లో పొందుపర్చిన వివరాలతో వెల్లడైంది.

President Ram Nath Kovind completes four years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News