- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 57,672మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,627 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారినపడి మరో 17మంది బాధితులు మరణించినట్లు తెలపింది. తాజా కేసులతో ఎపిలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19,56,392కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 13273 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 2017మంది బాధితులు కోలుకోగా, ఇప్పటవరకు 19,21,371 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,748 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
1627 New Corona Cases Reported in AP
- Advertisement -