- Advertisement -
ఎఎస్పి ఉద్యోగంతో పాటు రూ. కోటి నజరానా
మీరాబాయికి మణిపూర్ ప్రభుత్వం గౌరవం
న్యూఢిల్లీ: చారిత్రక ప్రదర్శనతో భారత ఖ్యాతని ప్రపంచానికి చాటిన మీరాబాయి చానుకు ఆమె సొంత రాష్ట్రం మణిపూర్ ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. మణిపూర్ పోలీస్ శాఖలో చానుకు ఉన్నతోద్యోగం కల్పించారు. చాను సాధించిన చారిత్రక విజయానికి ప్రతిఫలంగా ఆమెకు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పోర్ట్)గా నియమించారు. అంతేగాక ముందే ప్రకటించినట్టు చానుకు కోటి రూపాయల నగదు బహుమతిని ఇస్తామని మణిపూర్ సిఎం బీరెన్ సింగ్ స్పష్టం చేశారు. ఇదిలావుండగా మీరాబాయి ప్రస్తుతం రైల్వే శాఖలో టిసిగా విధులు నిర్వహిస్తోంది.
- Advertisement -