Monday, November 25, 2024

భిక్షాటన నిషేధంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

Supreme Court comments on ban on begging

న్యూఢిల్లీ : వీధుల్లో భిక్షాటనను నిషేధించడానికి ఉన్నత వర్గాలకు అనుకూలంగా తాను పక్షపాత ధోరణిని ప్రదర్శించ లేనని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్య, ఉపాధి లేకపోవడంతో కనీస జీవనోపాధిని పొందడం కోసం బిచ్చమెత్తుకోడానికి వీధుల్లోకి వస్తున్నారని, ఇది సాంఘిక, ఆర్థిక సమస్య అని పేర్కొంది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వీధుల్లో తిరిగే బిచ్చగాళ్లకు, నిరాశ్రయులకు టీకాలు వేయించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ చిన్నయ్ శర్మను ఉద్దేశించి జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ పేదరికం వల్ల బిచ్చగాళ్లు వీధుల్లోకి వచ్చి బిచ్చమెత్తుకుంటున్నారని, ఇది సాంఘిక సంక్షేమ విధానానికి సంబంధించిన సమస్య అని, దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో వీధులు, ట్రాఫిక్ జంక్షన్ల నుంచి బిచ్చగాళ్లను తొలగించాలని తాము ఆదేశించలేమని పేర్కొన్నారు.ఈ సమస్యను పరిష్కరించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News