- Advertisement -
రాష్ట్రపతికి 7 ప్రతిపక్షాల లేఖ
న్యూఢిల్లీ: రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో చర్చించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏడు ప్రతిపక్ష పార్టీలు మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశాయి. లేఖ రాసిన పార్టీలలో బిఎస్‌పి, ఆర్‌ఎల్‌పి, ఎస్‌ఎడి, నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఐ, సిపిఎం, ఎన్‌సిపి ఉన్నాయి. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ పలువురు రైతులు మరణించినప్పటికీ ఈ అంశాన్ని చర్చించడానికి కేంద్రం ముందుకురాకపోవడం దురదృష్టకరమని ఎస్‌ఎడి నాయకురాలు హర్‌సిమ్రత్ బాదల్ వ్యాఖ్యానించారు. ఈ రెండు అంశాలను పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించడానికి రాష్ట్రపతి జోక్యాన్ని కోరుతూ ఏడు పార్టీలు లేఖ రాసినట్లు ఎన్‌సిపి నాయకురాలు సుప్రియా సూలే తెలిపారు.
- Advertisement -