మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరలపై హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది. ఈక్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విభజన అనంతరం టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని హైకోర్టు ప్రశ్నించింది. టికెట్ల ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు హైకోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఆ కమిటీ సూచనలు ప్రభుత్వానికి నివేదించినట్లు ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ, హోంశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎంఎల్‌ఎ చెన్నమనేని పౌరసత్వంపై:
ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిగింది. ఇప్పటికే చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయగా, కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై చెన్నమనేని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కౌంటర్ పిటిషన్లపై ఇరుపక్షాలు తమ వాదనలను హైకోర్టుకు వినిపించారు. ఇక కేంద్రం ధాఖలు చేసిన అఫిడవిట్ పై చెన్నమనేని కౌంటర్ అఫిడవిట్ ధాఖలు. కౌంటర్ పిటిషన్ లపై ఇరు వాదనలు విన్న హైకోర్టు సెక్షన్ 5 (1) ఎఫ్ సిటిజన్ షిప్ యాక్ట్ 1955 చెన్నమనేని భారత పౌరసత్వం పొందడానికి అర్హుడని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే ఆయనకు ఎన్నికల్లో పాల్గొనడానికి పూర్తి అర్హత ఉందని, ఇప్పటికే మూడు పర్యాయాలు ఎంఎలఎ గా గెలిచాడని,భారత పౌరుడిగా ఉండి జర్మనీ వెళ్లి వచ్చాడని కోర్టుకు తెలిపారు. అయితే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఇప్పటి కూడా చెన్నమనేని రమేష్ జర్మనీ లో ఉన్నాడని, భారత ప్రభుత్వానికి ఓసిఐ కార్డ్ కోసం అప్లయ్ చేశాడని కేంద్ర హోమ్ శాఖ కూడా చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు తెలిపిందని పిటీషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నాడు. ఈ కేసు వర్చువల్ కోర్ట్ నడుస్తున్న నేపథ్యంలో ఫిజికల్ కోర్టులో పూర్తి వాదనలు వినిపిస్తామని చెన్నమనేని తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఆగష్టు 10 కి వాయిదా వేసింది.
TS High Court Heard on Movie Tickets price