Monday, November 25, 2024

లిబియా తీరంలో ఘోర పడవ ప్రమాదం : 57 మంది మృతి

- Advertisement -
- Advertisement -

57 killed in Libyan boat accident

కైరో : ఆఫ్రికా వలసదారులతో వెళ్తున్న పడవ సోమవారం ప్రమాదవశాత్తు లిబియా తీరంలో బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో దాదాపు 57 మంది మృతిచెందినట్టు భావిస్తున్నామని యుఎస్ మైగ్రేషన్ అధికారి తెలిపారు. పశ్చిమ తీరం కుమ్స్ నుంచి ఆదివారం ఈ పడవ బయలు దేరిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అధికార ప్రతినిధి సఫా మెహ్లీ చెప్పారు. మృతుల్లో నైజీరియా, ఘనా, గాంబియాకు చెందిన వారున్నారు. దుర్ఘటన జరిగిన సమయంలో పడవలో 75 మంది వరకు ఉన్నారు.

మునిగిపోయినట్టు భావిస్తున్న 57 మందిలో 20 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమె తెలిపారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా సముద్రంలో పడవ ఆగిపోయిందని, ఆ తరువాత ప్రతికూల పరిస్థితుల్లో బోల్తా పడిందని తెలిసింది. ఈ ప్రమాదంలో 18 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. లిబియా తీరంలో వారం రోజుల్లో వలస కార్మికుల పడవ ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఐరోపాలో మెరుగైన జీవితం కోసం వలస దారులు, శరణార్ధులు మధ్యధరాసముద్రం మీదుగా పడవల్లో వలస వెళ్తుండడం తరచుగా జరుగుతోంది. ఇదిలా ఉండగా మరో 500 మంది వలస వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అధికారులు అడ్డుకుని లిబియాకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News