పదకొండు మంది నిందితుల అరెస్టు
హైదరాబాద్: ఆన్లైన్ గేమ్‌ల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న పదకొండు మంది నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,39,620 నగదు, 52 కార్డులు, రెండు అదనపు ప్లే కార్డులు, ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దత్తాత్రేయ నగర్ కాలనీలో గేమింగ్ హౌస్‌పై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. స్థానిక కాలనీకి చెందిన ఠాకూర్ విజేందర్ సింగ్ అలియాస్ విక్కిసింగ్, వినోద్ సింగ్, ఎస్. రాజేష్, వెంకటేష్, సయ్యద్ మహమూద్, ప్రకాష్, మొహద్చంద్, కేశవ్, హుస్సేన్ ఖాన్, వెంకటేష్, మొహద్ వాజర్ కలిసి ప్లే కార్డులు ఆడుతున్నారు. ప్రధాన నిందితుడు ఠాకూర్ విజేందర్ సింగ్ అలియాస్ విక్కీ సింగ్ ఆటగాళ్ల నుంచి ప్రతి ఆటకు కమీషన్ తీసుకుని గేమింగ్ హౌస్ నిర్వహిస్తున్నాడు. నిందితులను అరెస్టు చేసి మంగళ్‌హాట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.