Monday, November 18, 2024

ఈటెల… దళితులకు క్షమాపణ చెప్పాలి: ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ ఎంఆర్‌పిఎస్ ఆందోళన చేపట్టింది. ఈటెల బావమరిది మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఈటెల వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మేడిపాపయ్య డిమాండ్ చేశారు. మధుసూదన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని పాపయ్య కోరారు. ఈటెల కుటుంబంపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని, దళితబంధు పథకాన్ని ఆపేందుకు బిజెపి నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితుల పట్ల మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, నల్లగొండ, సూర్యాపేట, ఉస్మానియా యూనివర్సిటీలో మధుసూదన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News