కొలంబో:ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్ టీ20లో మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 5 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. రుతురాజ్ గైక్వాడ్(14), సంజూ శాంసన్(0), పడిక్కల్(9), నితీష్ రాణా(6)లు ఘోరంగా విఫలమయ్యారు. వీరి తర్వాత భువనేశ్వర్(), కుల్దీప్ యాదవ్()లు మరో వికెట్ కోల్పోకుండా లంక బౌలర్ల దాటిని ఎదుర్కొంటూ స్కోరు బోర్డును కదిలించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 81 పరుగులు చేసింది. దీంతో భారత్, లంకకు కేవలం 82 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక బౌలర్ హసరంగా నాలుగు ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు.
IND vs SL 3rd T20: India set target 82 runs