Saturday, November 16, 2024

మళ్లీ కరోనా ఉనికి

- Advertisement -
- Advertisement -

గాంధీ ఆసుపత్రికి పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
రోజుకు 40మందికిపైగా చికిత్స కోసం చేరుతున్న రోగులు
30 శాతం మంది మాస్కులు ధరించకుండా దర్జాగా రోడ్లపైకి
కొవిడ్ నిబంధనలు విస్మరిస్తే థర్డ్‌వేవ్ తప్పదంటున్న వైద్యులు

Ventilation is only way to control Coronavirus in air

మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మళ్లీ కరోనా మహమ్మారి చాపకింది నీరుల్లా విస్తరిస్తోంది. గత రెండు నెల నుంచి తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా రోగులకు చికిత్స అందించే గాంధీ ఆసుపత్రికి ప్రతి రోజు 42 వరకు కొత్త కేసులు వస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 386 మంది చికిత్స పొందుతున్నారు. మొదటివేవ్ కరోనా సమయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టిమ్స్‌లో కూడా కరోనా కేసులు పె రుగుతున్నట్లు తెలుస్తుంది. ఈనెల రెండోవారం నుంచి బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రజలు నిర్వహించడంతో కొవిడ్ నిబంధనల పట్ల నిర్లక్షం వ హించడం, మాస్కులు ధరించకుండా గుంపులుగా తిరగడం ద్వారా వైరస్ మరోసారి ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సీజనల్ వ్యాధులు తోడు కావడంతో వాటి లక్షణాలు కూడా దగ్గు, జ్వరం, జలుబు ఉండటంతో ప్రజలు టెస్టులు చేయించుకోవడంతో పాజిటివ్ బయట పడుతుంది.

7432 New Corona Cases Registered In Telangana

దీంతో వైద్యం కోసం రోగులు గాంధీ, టిమ్స్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. రోడ్లపై దుకాణాల్లో తిరిగే వారిలో 30శాతం మందికి మాస్కులు పెట్టుకోవడంలేదని, వ్యాపార సముదాయాల వద్ద శానిటైజర్లు అందుబాటులో లేని పోలీసులు గుర్తించారు. ప్రజలు ఇష్టానుసారంగా సంచరిస్తే థర్డ్‌వేవ్ ముప్పు ఎంతో దూరం లేదని, రెండు నెలల్లో ప్రజల ప్రా ణాలతో చెలగాటమాడుతుందంటున్నారు. గాంధీకి జూన్ రెండో వారం నుంచి జూలై రెండో వారం వరకు రోజుకు 20నుంచి 15లోపు పాజిటివ్ కేసులు వచ్చేవి. వారం రోజుల నుంచి రోజుకు 40పై వస్తున్నట్లు, మం గళవారం 46, బుధవారం 32 మంది వైద్యం కోసం చేరారు. ప్రస్తుతం ఆ సుపత్రిలో 380 మంది, చికిత్స పొందుతుండగా వీరిలో 210మంది క రోనా, 170మంది బ్లాక్ పంగస్ రోగులు ఉన్నారు.అదే విధంగా గచ్చిబౌలి టిమ్స్‌లో కూడా 61మంది చేరినట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు.

గాంధీలో రోజుకు 32మంది వరకు వైరస్ కోలుకుని ఇంటి వెళ్లుతుండగా, చేరే వారి సంఖ్య అంతకు పెరిగిందని ఆసుపత్రి ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ఆగస్టు 3నుంచి సాధారణ సేవలు ప్రారంభించి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే మళ్లీ వైరస్ ప్రభావంతో గాంధీలో నాన్‌కోవిడ్ సేవలపై వైద్యశాఖ తర్జనభర్జన పడుతుంది. ప్రా రంభిస్తే పాజిటివ్ కేసులు పెరిగితే థర్డ్‌వేవ్‌లో వైరస్‌ను అదుపు చేయడం కష్టమైతుందని, ఇప్పటికే నాలుగు నెలల నుంచి వైద్యసిబ్బంది కరోనాతో పోరాటం చేస్తూ పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనారని, మళ్లీ మహమ్మారి పంజా విసిరితే గతంలో చవిచూసిన రెండ్‌వేవ్‌ల కంటే ప్రమా దంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నగర ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి, మాస్కులు, భౌతికదూరం, శానిటైజ్ వినియోగిస్తే వైరస్ విస్తరి ంచకుండా అదుపు చేయవచ్చంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News