Tuesday, November 5, 2024

ఇండియన్ల రాకపై ఫిలిప్పైన్స్ నిషేధం

- Advertisement -
- Advertisement -

Philippines extends travel ban on India

మనీలా:  కోవిడ్ డెల్టా వేరియంటు వ్యాప్తి నిరోధక చర్యలలో భాగంగా ఫిలిప్పైన్స్ ప్రయాణ నిషేధ క్రమాన్ని విస్తరించింది. భారతదేశం, మరో తొమ్మిది దేశాల నుంచి ప్రయాణికుల రాకపై ఉన్న నిషేధాన్ని ఆగస్టు 15వరకూ పొడిగించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటాన్ని గుర్తించి, విమానయాన ప్రయాణాలపై ఆంక్షలను మరింత తీవ్రతరం చేశారు. ఈ మేరకు ఇంటర్ ఏజెన్సీ టాస్క్‌ఫోర్స్ (ఐఎటిఎఫ్) చేసిన సిఫార్సులకు ప్రెసిడెంట్ రొడ్రిగో రొవా డ్యుటెర్టె ఆమోదం తెలిపారు. ఇప్పటివరకూ పది దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఉన్నాయి. ఇప్పటి ఉత్తర్వులతో ఇండియా నుంచి ఇతర దేశాల నుంచి ఎవరూ ఫిలిప్పైన్స్‌కు రావడానికి వీల్లేదు. ఇండియా, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఒమన్, యుఎఇ, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్ నుంచి వచ్చే వారిపై ప్రయాణ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రెసిడెంట్ అధికార ప్రతినిధి హ్యారీ రోక్యూ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News