అందులో తెలంగాణలో రెండు గుర్తించాం: కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 70 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో రెండు కేసులు తెలంగాణలో నమోదైనట్లు వెల్లడించింది. శుక్రవారం లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో భాగంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు వెల్లడించారు. దేశంలో కొవిడ్ యొక్క జన్యు శ్రేణిని పర్యవేక్షించే ఇండియన్ కొవిడ్ జెనోమిక్స్ కన్సార్టియం ఈ మేరకు గుర్తించినట్లు తెలిపారు. దేశంలోని 28 ప్రయోగశాలల్లో కరోనా వేరియంట్లకు సంబంధించిన 58,240 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. వీటిలో 46,124 నమూనాలను జన్యుపరంగా విశ్లేషించినట్లు వివరించారు. 4172 నమూనాలు ఆల్ఫా వేరియంట్, 217 నమూనాలు బీటా వేరియంట్, ఒక నమూనా గామా వేరియంట్, 17,169 నమూనాలు డెల్టా వేరియంట్, 70 డెల్లా ప్లస్ వేరియంట్లను గుర్తించినట్లు వెల్లడించారు.