రికవరీ రేట్ 97.38, మరణాలు 1.34 శాతం
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19 కేసులు 44,230,మరణాలు 555 నమోదయ్యాయి. దీంతో,మొత్తం కేసుల సంఖ్య 3,15,72,344కి, మొత్తం మరణాల సంఖ్య 4,23,217కి చేరింది. రోజువారీ మరణాలు 1000 దిగువన నమోదయ్యాయి. కోలుకున్నవారి సంఖ్య 3,07,43,972కి చేరింది. రికవరీ రేట్ 97.38 శాతంగా, మరణాల రేట్ 1.34 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,05,155గా నమోదైంది. మొత్తం కేసుల్లో ఇది 1.28 శాతం అని ఆరోగ్యశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేట్ 2.44 శాతంగా, వారం పాజిటివిటీ రేట్ 2.43 శాతంగా నమోదైంది. గురువారం 18,16,277 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో, మొత్తం పరీక్షల సంఖ్య 46,46,50,723కి చేరిందని ఐసిఎంఆర్ తెలిపింది. 24 గంటల్లో దేశంలో 555 మరణాలు నమోదు కాగా, అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 190, కేరళలో 128 నమోదయ్యాయి. దేశంలో శుక్రవారం ఉదయం వరకు 45.60 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని ఆరోగ్యశాఖ తెలిపింది.