Thursday, September 19, 2024

పెగాసస్‌పై వచ్చే వారం విచారణ

- Advertisement -
- Advertisement -
SC agrees to hear Pegasus snooping plea next week
సుప్రీంకోర్టు అంగీకారం

న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. పెగాసస్ స్నూపింగ్ కుంభకోఫంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశి కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చేవారం విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పెగాసస్‌పై దాఖలైన వివిధ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తామని ప్రకటించింది. పనిభారాన్ని బట్టి వచ్చేవారం వాటిపై విచారణ జరుపుతామని జస్టిస్ ఎన్‌వి రమణ తెలిపారు. పెగాసస్‌పై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి పౌర స్వేచ్ఛపై పెగాసస్ తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. పెగాసస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థలోని ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిందనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోందని, అందువల్ల దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ‘దీనిపై వచ్చేవారం వింటాం’ అని సిజెఐ స్పందించారు. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్‌ను ఉపయోగించి దేశంలోని రాజకీయ నేతలు, ప్రముఖ పౌరులు, జర్నలిస్టులు సుమారు 300 మంది ఫోన్లను హ్యాక్ చే శారంటూ మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పార్లమెంటులో సమావేశాలు ప్రారంభమైన రోజునుంచీ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News