జపాన్‌పై భారత్ జయభేరి
టోక్యో: ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్ అదరగొడుతోంది. వరుస విజయాలతో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన పూల్‌ఎ మ్యాచ్‌లో భారత్ 53 గోల్స్ తేడాతో ఆతిథ్య జపాన్‌ను చిత్తు చేసింది. మన్‌ప్రీత్ సేనకు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. మొత్తం మీద పూల్‌ఎలో ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. అది కూడా ఆస్ట్రేలియా చేతిలోనే. మిగిలిన నాలుగు మ్యాచుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. ఇక జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించింది. ఆట 13వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు మొదటి గోల్‌ను సాధించి పెట్టాడు. కొద్ది సేపటికే భారత్‌కు మరో గోల్ లభించింది. 17వ నిమిషంలో గుర్జంత్ సింగ్ ఈ గోల్ సాధించాడు.
తర్వాత కూడా భారత్ దూకుడుగా ఆడింది. 34వ నిమిషంలో శంషేర్ సింగ్ భారత్‌కు మరో గోల్ అందించాడు. దీంతో భారత్ మరింత పటిష్టస్థితికి చేరుకుంది. ఇక 51వ నిమింలో నీలకంఠ శర్మ భారత్‌కు నాలుగో గోల్‌ను అందించాడు. ఆ వెంటనే గుర్జంత్ సింగ్ తన రెండో గోల్‌తో భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. మరోవైపు జపాన్ ఆటగాళ్లు కూడా బాగానే పోరాడినా ఫలితం లేకుండా పోయింది. భారత్‌కు దీటుగా పోరాడుతూ మూడు గోల్స్‌ను నమోదు చేశారు. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన భారత్ హ్యాట్రిక్ విజయంతో లీగ్ దశను ముగించింది.