Saturday, November 16, 2024

తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు..

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: ఇజ్రాయెల్‌లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు తల్లి గర్భంలో ఉండగానే గర్భం దాల్చి వైద్యులను ఆశ్చర్య చకితులను చేసింది. ఈ నవజాత శిశువులో ఒక్కటి కంటే ఎక్కువ పిండాలు ఉండడం వైద్యులు గుర్తించారు. మనిషి రూపాన్ని సంతరించుకున్న ఈ పిండాల్లో గుండె, ఎముకలు, కూడా అభివృద్ధి చెందాయి. సర్జరీ చేసి పిండాలను తొలగించి ఆ శిశువుకు వైద్య చికిత్స చేస్తున్నారు. ఇలాంటివి చాలా అరుదుగా పది లక్షల మందిలో ఒకరిలో కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ లోని ఆష్‌లోడ్ అనే పట్టణంలోని ఆస్సుటా మెడికల్ సెంటర్‌లో ఈనెల తొలివారంలో ఒక మహిళ ఈ శిశువును ప్రసవించింది. ప్రసవానికి ముందు గర్భిణికి అల్ట్రాసౌండ్ పరీక్షలు జరిపిన వైద్యులు గర్భంలోని ఆడశిశువు పొట్ట భాగం సాధారణంగా ఉండాల్సిన ఎత్తు కన్నా ఎక్కువగా ఉండడంతో వైద్యులు ఆశ్చర్య పోయారు.

ప్రసవం అనంతరం చిన్నారికి అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే పరీక్షలు జరిపారు. ఆ శిశువు కడుపులో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు ఉన్నట్టు గుర్తించారు. నియోనాటాలజీ విభాగం డైరెక్టర్ ఓమర్ గ్లోబస్ నేతృత్వంలో ఆ బిడ్డకు సర్జరీ చేసి పిండాలు బయటకు తీశారు. శిశువు కడుపులోని పిండాలు ఇప్పుడిప్పుడే రూపు దిద్దుకుంటున్నాయని, తల్లి గర్భంలో కవల పిండాలు తయారవుతున్న సమయంలో కొంత వృద్ధి చెందిన పిండంలోకి మరో పిండం చొచ్చుకుని పోవడం వల్ల ఇది జరిగిందని వెల్లడించారు.

baby girl born with twin fetus inside Stomach in Israel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News