Saturday, November 23, 2024

జరభద్రం….. రేపు బోనాలు

- Advertisement -
- Advertisement -

Telangana ashadam bonalu tomorrow 2021

నగరంపై పొంచి ఉన్న కరోనా వైరస్
వేడుకల్లో కోవిడ్ నిబంధనలు పాటించకుంటే థర్డ్‌వేవ్ తప్పదు
కుటుంబ సభ్యులతో పరిమితంగా చేసుకోవాలంటున్న వైద్యులు
రోజు రోజుకు గాంధీలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య

హైదరాబాద్: నగరంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు స్దానిక ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. గతేడాదిలో కరోనా వైరస్ కారణంగా అమ్మవారికి బోనం సమర్పించేందుకు వీలు లేకపోవడంతో ఇంటివద్దే నిర్వహించుకున్నారు. ఈ అషాడ మాసంలో బోనాల పండగను చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి తగిన ఏర్పాటు చేయడంతో ఉత్సవాలను అట్టహాసంగా చేసేందుకు సిద్దమైయ్యారు. మరోపక్క వైద్యశాఖ అధికారులు కోవిడ్ నిబంధనలు పాటించి బోనం సమర్పించుకోవాలని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుందని హెచ్చరిస్తున్నారు. థర్డ్‌వేవ్‌కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని, వేడుకలు, ఉత్సవాల సమయంలో ప్రజలు భౌతికదూరం పాటిస్తూ ముఖానికి మాస్కులు తప్పకుండా ధరించాలని కోరుతున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సీజనల్ వ్యాధులు తోడు కాగా, బోనాల పండగలకు ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే మరోసారి లాక్‌డౌన్ వైపు అడుగులు వేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి గాంధీ ఆసుపత్రికి పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు, ప్రస్తుతం 380మంది చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఆదివారం జరిగే పాతబస్తీ, దిల్‌షుక్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్ ఏరియాల్లో బోనాలు జరుగుతుండగా అయా ప్రాంతవాసులు కుటుంబ సభ్యులతో చేసుకోవాలని, బంధువులు, స్నేహితులను పిలిచి విందు కార్యక్రమాలు చేపడితే వైరస్ రెక్కలు కట్టుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. వారం రోజుల నుంచి గ్రేటర్ నమోదైన పాజిటివ్ కేసులు చూస్తే ఈనెల 24వతేదీన 81 మంది, ఈనెల 25న 76మందికి సోకగా, ఈనెల 26వ తేదీన 59మంది, ఈనెల27వ తేదీన 72 పాజిటివ్ కేసులు, ఈనెల 28న 77 మందికి వైరస్ సోకగా, ఈనెల 29వ తేదీన 70 కేసులు, 30వ తేదీన 73మంది పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు గణాంకాలు వెల్లడించాయి.

ప్రజలు నిర్లక్షంగా వ్యవహరిస్తే పెరగబోయే కేసులు ఊహించడం కష్టమంటున్నారు. ఇటీవల కాలంలో పోలీసులు పలు వ్యాపార సముదాయాలు, రోడ్లపై ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారనే అంశం పరిశీలిస్తే 40శాతంమంది వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించకుండా అడ్డగోలుగా ప్రజల మధ్య తిరుగుతున్నట్లు వెల్లడిస్తున్నారు. గత ఆదివారం జరిగిన సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు పరిమిత సంఖ్యల్లో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అదే విధంగా పాతబస్తీ ప్రజలు కూడా ఊరేగింపులతో గుంపులుగా రాకుండా వ్యక్తుల మధ్యదూరం పాటించి, అమ్మవారికి మొక్కలు తీర్చుకోవాలని సూచనలు చేస్తున్నారు. థర్డ్‌వేవ్ వస్తే పరిస్దితులు తీవ్రంగా ఉంటాయని, అందుకోసం ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వేగానికి అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News