Saturday, November 23, 2024

అసోం -మిజోరం సరిహద్దులో సెగలే

- Advertisement -
- Advertisement -
Assam And Mizoram border dispute Update
306 హైవేపై కదలని సరుకుల ట్రక్కులు

గువహతి/ ఐజ్వాల్:  అసోం మిజోరం సరిహద్దు ప్రాంతం శనివారం ఎటువంటి అవాంచనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉంది. అయితే ఇప్పటికీ ఉద్రిక్తతల ఛాయలు ఉండనే ఉన్నాయి. వివాదాన్ని పరిష్కరించుకుని, ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అసోం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇతర ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లతో అసోం ప్రభుత్వ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. అసోం, మిజోరం పోలీసుల మధ్య తీవ్రస్థాయి ఘర్షణలతో సరిహద్దులలో అవాంఛనీయ పరిస్థితి ఏర్పడింది. అధికార యంత్రాంగ సంయమనంతో ఉన్నప్పటికీ ఇరు రాష్ట్రాల సరిహద్దుల వెంబడి ఉండే వర్గాలలో కొందరు కలహించుకునే పరిస్థితి ఏర్పడటం ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెట్టింది.

అంతరాష్ట్ర సరిహద్దుల వెంబడి సమగ్రత అత్యవసరం అని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇతర పొరుగు రాష్ట్రాలు సహకరించాలని కోరారు. ఇటీవలి సరిహద్దుల ఘర్షణలపై మిజోరం ప్రభుత్వం తనపై కేసు పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. గత సోమవారం నుంచి మిజోరం నుంచి ఎటువంటి వాహనాలు సరిహద్దులు దాటి అసోంలోకి రావడం లేదు. మిజోరంకు అస్సామీలు ఎవరూ వెళ్లకూడదని అసోం ప్రభుత్వం సలహాలు వెలువరించింది. తాము ఆర్థిక దిగ్బంధనం పాటిస్తున్నామనే వాదనను అసోం ప్రభుత్వం ఖండించింది. తమ రాష్ట్రానికి రావల్సిన నిత్యావసర సరుకులు, కోవిడ్ టీకాలు, టెస్టు కిట్స్ వంటి వాటితో ఉన్న వాహనాలు అసోంలోని కచార్ జిల్లాలో జాతీయ రహదారి 306పై లైలాపూర్ ధోలాయ్ వద్ద నిలిచిపోయినట్లు మిజోరం హోం శాఖ కార్యదర్శి లాల్బియాక్సంగీ తెలిపారు. ఈ మేరకు ఆమె కేంద్ర హోం శాఖకు లేఖ పంపించారు.

Assam And Mizoram border dispute Update

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News