Saturday, November 23, 2024

ఫ్లోరిడాలో కరోనా విలయ తాండవం

- Advertisement -
- Advertisement -

State of Florida recorded record 21,683 corona cases

ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 21,683 కొత్త కేసులు
రోజూ 17 వేలకు మించి కేసుల నమోదు

ఒరియాండో ( అమెరికా) : ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక్క రోజు లోనే రికార్డు స్థాయిలో 21,683 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఇదే అత్యంత భారీ సంఖ్యగా ఫెడరల్ హెల్త్ డేటా వెల్లడించింది. జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రం కరోనా కేంద్రంగా మారింది. శుక్రవారం నమోదైన తాజా గణాంకాలు అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెబ్‌సైట్‌లో శనివారం వెల్లడయ్యాయి. ఎంతవేగంగా కేసులు పెరుగుతున్నాయో ఈ వివరాలు తెలియచేస్తున్నాయి. వ్యాక్సిన్లు అందుబాటు లోకి రాకముందు గత ఏడాది జనవరి 7 న ఫ్లోరిడాలో 19,334 కేసులు నమోదు కాగా, ఇప్పుడు రోజూ 17,093 వరకు కేసులు నమోదవుతున్నాయి. ఈవారం 409 మంది మృతి చెందడంతో గత ఏడాది మార్చి తరువాత మొట్టమొదటి సారి మృతుల సంఖ్య 39,000 కు చేరుకుంది. గత ఏడాది ఆగస్టు మధ్యలో తారా స్థాయిలో మరణాలు సంభవించాయి.

ఏడు రోజుల కాలంలో 1266 మంది చనిపోయారు. గత కొన్ని వారాలుగా ఆస్పత్రుల పాలైన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ ఇదంతా సీజనల్‌గా పెరిగిన కేసులు తప్ప మరేం కాదని వ్యాఖ్యానించారు. అత్యధిక వేడి వాతావరణం కారణంగా చాలామంది ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోతున్నారని, ఎసి వల్ల వైరస్ వ్యాపిస్తోందని వ్యాఖ్యానించారు. గత ఏడాది మాదిరి గానే ఆస్పత్రుల పాలైన వారి సంఖ్య పెరుగుతోందని ఫ్లోరిడా ఆస్పత్రుల అసోసియేషన్ పేర్కొంది. అత్యవసరం కాని సర్జరీలను ఈ వారం చేయబోమని, కరోనా రోగుల చికిత్సలే చేస్తామని ప్రకటించింది.

ఫ్లోరిడాలో థీమ్ పార్కుల రిసార్టులు సందర్శకులు, అతిధులు తమ గదుల్లో ఉన్నప్పటికీ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించాయి. ఉద్యోగులు, సిబ్బంది కూడా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని హెచ్చరించింది. వాల్‌డిస్నీ సంస్థ తమ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తూ ఇంకా టీకా పొందని వారికి 60 రోజుల గడువు ఇచ్చింది. ఇళ్ల దగ్గరే పనిచేస్తున్న సిబ్బంది కార్యాలయాలకు వచ్చే ముందు వ్యాక్సినేషన్ చేయించుకున్నట్టు రుజువు చూపించాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News