Friday, November 22, 2024

దళితబంధు పైలెట్ ప్రాజెక్టు నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్..

- Advertisement -
- Advertisement -

Petition in High Court against Dalit Bandhu pilot project

హైదరాబాద్: తెలంగాణలోని దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రకటించిన దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యంగ విరుద్ధమని.. తెలంగాణ ప్రభుత్వం, ఈసి, టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిని ప్రతివాదులుగా పిటిషన్ చేర్చారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ తరుఫు లాయర్ కోర్టును కోరారు. అయితే, జాబితా ప్రకారమే విచారిస్తామని, దళితబంధు పైలెట్ ప్రాజెక్టుపై అత్యవసరంగా విచారించలేమని కోర్టు తెలిపింది.

Petition in High Court against Dalit Bandhu pilot project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News