- Advertisement -
హైదరాబాద్: ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంసెట్ కన్వీనర్ ప్రొ. గోవర్థన్ తెలిపారు. ఈ నెల 4,5,6వ తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశ పరీక్ష ఉంటుందని, సిబిటి విధానంలో ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 82 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇక్కడ చదివే ఎపి విద్యార్థుల కోసం 23 పరీక్ష కేంద్రాలు ఉంటాయని, విద్యార్థుల సౌలభ్యం కోసం తెలుగు, ఇంగ్లీష్, ఉర్థూ భాషల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తామని గోవర్థన్ వెల్లడించారు.
- Advertisement -