Sunday, November 17, 2024

500 దిగువకు మరణాలు…

- Advertisement -
- Advertisement -
30549 new covid 19 cases reported in india
30,549 కేసులు, రికవరీ రేట్ 97.38

న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19 కేసులు 30,549,మరణాలు 422 నమోదయ్యాయి. దీంతో,మొత్తం కేసుల సంఖ్య 3,17,26,507కి, మొత్తం మరణాల సంఖ్య 4,25,195కి చేరింది. రోజువారీ మరణాలు 500 దిగువన నమోదయ్యాయి. కోలుకున్నవారి సంఖ్య 3,08,96,354కి చేరింది. రికవరీ రేట్ 97.38 శాతంగా, మరణాల రేట్ 1.34 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,04,958గా నమోదైంది. మొత్తం కేసుల్లో ఇది 1.28 శాతం అని ఆరోగ్యశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేట్ 1.85 శాతంగా, వారం పాజిటివిటీ రేట్ 2.39 శాతంగా నమోదైంది. సోమవారం 16,49,295 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో, మొత్తం పరీక్షల సంఖ్య 47,12,94,789కి చేరిందని ఐసిఎంఆర్ తెలిపింది. దేశంలో మంగళవారం ఉదయం వరకు 47.85 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని ఆరోగ్యశాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News