Monday, November 18, 2024

కేంద్రం పాత చింతకాయ సమాధానం

- Advertisement -
- Advertisement -

B Vinod Kumar criticises centre over Assembly seats

 

సీట్ల పెంపుకు మనసుంటే మార్గం ఉండదా!
2014 రాష్ట్ర విభజన చట్ట సవరణ అనేది చాలా చిన్న అంశం
ఈ చట్ట సవరణతోనే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఎపిలో కలిపారు
మరి అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఎందుకు సవరణ చేయరూ
కేంద్రాన్ని ప్రశ్నించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. కేంద్రానికి మనసుంటే అసెంబ్లీ సీట్ల పెంపుకు మార్గం ఉంటుందన్నారు. రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు విభజన చట్టంలో వెంటనే సవరణలు చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 26లో సబ్జెక్టు అనే పదం తొలగించి నాట్ విత్ స్టాండింగ్( ఏది ఏమైనప్పటికీ) అనే పదాన్ని చేర్చి చట్ట సవరణ చేసి అసెంబ్లీ సీట్లను పెంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. చిన్న సవరణతో సరిపోయే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని మంగళవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రాల విభజన చట్టంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు సవరణలు చేసిందని ఈ సందర్భంగా వినోద్‌కుమార్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించినప్పటికీ విభజన చట్టంలో సవరణలు చేసి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపలేదా? అని ప్రశ్నించారు. అలాగే శాసన మండలి సీట్లను కూడా పెంచారన్నారు. అప్పుడు చట్ట సవరణకు మనస్సు వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి రెండు తెలుగు రాష్ట్రాలు కోరుతున్నా అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచరని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి పార్లమెంట్‌లో తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపుపై అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జవాబిస్తూ 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని చెప్పడం చూస్తుంటే పాత చింతకాయ సమాధానంగా ఉందని వినోద్ కుమార్ విమర్శించారు.

తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు కోసం గతంలో తాను పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టానని వినోద్‌కుమార్ తెలిపాఉ. ఎంపి కేశవరావుతో కలిసి తాను అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించామని, అప్పుడు న్యాయ శాఖ ఉన్నతాధికారులు అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమేనని చెప్పారని ఈ సందర్భంగా వినోద్ కుమార్ గుర్తు చేశారు. అందువల్ల కేంద్రం భేషజాలకు వెళ్లకుండా, పెద్ద మనస్సు చేసుకుని తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను తక్షణమే పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News