Friday, November 22, 2024

రేపటి నుంచి ఇంజనీరింగ్ ఎంసెట్

- Advertisement -
- Advertisement -

రెండు గంటల ముందే హాల్లోకి అనుమతి
పరీక్ష ప్రారంభ సమయానికి
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
మూడు రోజుల పాటు ఆరు సెషన్లలో పరీక్షలు
తెలంగాణ, ఎపిలో 105 పరీక్షా కేంద్రాల ఏర్పాటు

SC refuses to cancel, postpone PG final year Medical exams

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం(ఆగస్టు 4) నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 4,5,6 తేదీల్లో మొత్తం ఆరు సెషన్లలో జరిగే ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షలకు 1,64,962 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 82, ఎపిలో 23 పరీక్షా కేంద్రాలు, మొత్తం 105 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున మూడు రోజులపాటు ఆరు సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. విద్యార్థులకు పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచే అనుమతిస్తామని ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. ఉదయం 9 గంటల తర్వాత, మధ్యాహ్నం 3 గంటల తర్వాత పరీక్షలు ప్రారంభమవుతాయని, పరీక్ష ప్రారంభ సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌పై లొకేషన్ కూడా ఇస్తున్నామని తెలిపారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేలా చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు మాస్కులు ధరించి, చేతులను శానిటైజ్ చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రయాణ సమయాల్లో భౌతికదూరం పాటిస్తూ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఉంటుందని విద్యార్థులు ఆరోగ్య అంశాలు ఫిల్ చేసి ఇవ్వాలని చెప్పారు. సెల్ఫ్ డిక్లరేషన్‌పై గెజిటెడ్ లేదా ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. కొవిడ్ వచ్చిన విద్యార్థుల కోసం పరీక్ష రీషెడ్యూల్ చేస్తామని, లేదంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షులు పరీక్షా కేంద్రాలకు దూరంగా ఉండాలని కోరారు.

ఇవి గుర్తుంచుకోండి

విద్యార్థులను పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగానే హాలులోకి అనుమతిస్తారు. కాబట్టి చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ఉత్తమం.
పరీక్షా కేంద్రాలలో థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారికి వెనక్కి పంపిస్తారు. కరోనా వచ్చిన విద్యార్థులకు కోసం పరీక్ష రీషెడ్యూల్ చేస్తారు.
విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఇవ్వాలి. ఈ ఫారంపై గెజిటెడ్ లేదా ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు.
విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి.
రఫ్ వర్క్ కోసం వినియోగించిన బుక్‌లెట్‌ను ఇన్విజిలేటర్‌కు తిరిగి ఇవ్వాలి
విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. శానిటైజర్ బాటిల్‌ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, క్యాలుకులేటర్లు, వాచ్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెస్‌ను అనుమతించరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News