Saturday, November 23, 2024

ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేం

- Advertisement -
- Advertisement -

Godavari Krishna river boards joint meeting

కృష్ణ, గోదావరి బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీకి చెప్పిన ఆంధ్రప్రదేశ్
గెజిట్ నోటిఫికేషన్‌లో చేర్చిన ప్రాజెక్టులపై అభ్యంతరాలున్నాయి కేంద్రం దృష్టికి
తీసుకువెళ్తున్నాం : ఎపి ఇఎన్‌సి అధికారులు సమావేశానికి గైర్హాజరైన తెలంగాణ అధికారులు
ముందుగా గోదావరి బోర్డు పూర్తిస్థాయి భేటీని జరపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఇఎన్‌సి
లేఖ ఈ నెల రెండో వారంలో బోర్డు పూర్తి స్థాయి సమావేశం నిర్వహిస్తాం : జిఆర్‌ఎంబి
5న రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు కృష్ణ బోర్డు బృందం

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని జలసౌధలో మంగళవారం గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీకి బోర్డు సభ్య కార్యదర్శులు బిపి, రాయిపురే, బోర్డు స భ్యులు, కేంద్ర జలశక్తి శాఖ ప్రతినిధులు హాజరయ్యారు. వీరితో పా టు ఎపి ఈఎన్‌సీలు నారాయణరెడ్డి, సతీశ్, ఎపి ట్రాన్స్‌కో, జెన్‌కో ఎ ండిలు శ్రీకాంత్, శ్రీధర్ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ స మావేశానికి తెలంగాణకు చెం దిన సభ్యులు హాజరుకాలేదు. ఈ భేటీ లో గెజిట్ నోటిఫికేషన్ అమలు కా ర్యాచరణతో పాటు పలు అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలిసింది. గెజిట్ గడువు ప్రకారం ప్రాజెక్టుల స్వరూపం ఇతర వివరాలు ఇవ్వాలని కృష్ణా, గోదావరి బోర్డు సభ్యు లు ఎపి అధికారులను కోరగా నోటిఫికేషన్‌లో చేర్చిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు ఉన్నాయని, తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. అభ్యంతరాలున్న నేపథ్యంలో ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేమని ఎపి ఈఎన్‌సి అధికారులు బోర్డు సభ్యులతో తెలిపారు.

రెండో వారంలో పూర్తి బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తాం: జిఆర్‌ఎంబి

వివరాలు ఇచ్చి అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కృష్ణా, గోదావరి బోర్డు సభ్యులు ఎపి అధికారులకు సూచించాయి. తమ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని ఎపి ఈఎన్‌సీ అధికారులు బోర్డులకు వివరించారు. సంయుక్త సమన్వయ కమిటీ సమావేశాలు తరచూ జరుగుతాయని బోర్డు సభ్యులు తెలిపారు. ఈ నెల రెండో వారంలో పూర్తి బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తామని జిఆర్‌ఎంబీ తెలిపింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్ట్‌లను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసిన తర్వాత తొలిసారి కీలక భేటీ జరగ్గా అనుమతుల్లేని ప్రాజెక్టులు, బోర్డుకు నిధులు, సిఐఎస్‌ఎఫ్ భద్రత, విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలపై సభ్యులు చర్చించినట్టుగా సమాచారం. అక్టోబర్ నుంచి ప్రాజెక్ట్‌లన్నీ బోర్డుల పరిధిలోకి వెళ్లనుండడంతో దాని కోసం ఇప్పటి నుంచే బోర్డుల సభ్యులు కసరత్తు మొదలు పెట్టారు. అయితే అక్టోబర్ 14 నుంచి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వెళితే ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు నీటి విడుదల వంటి అంశాల్లో అధికారాలను కోల్పోనున్నాయి.

గెజిట్‌లోని కొన్ని అంశాలపై స్పష్టత కోరాం: ఎపి ఈఎన్సీ నారాయణరెడ్డి

గెజిట్ నోటిఫికేషన్‌లోని కొన్ని అంశాలపై మరింత స్పష్టత కోరామని ఎపి ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. తమ రాష్ట్రం ఎప్పుడూ నిబంధనలు ఉల్లంఘించలేదని, గెజిట్‌లోని కొన్ని అంశాలపై స్పష్టత కోరామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందని, బోర్డులపై ఎక్కువ భారం అవసరం లేదని ఆయన తెలిపారు. సాధారణ అంశాల్లో బోర్డుల జోక్యం అవసరం లేదని, క్లిష్టమైన అంశాలను మాత్రమే బోర్డులు చూడటం మేలని ఆయన పేర్కొన్నారు. అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా బోర్డులకు వివరాలు ఇస్తామన్నారు. భవిష్యత్‌లో గోదావరి నది పెద్ద సమస్యగా మారబోతుందని ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1430 టింఎంసీల నీరు కేటాయిస్తే, తెలంగాణే 1350 టింఎంసీల నీరు వాడుకునేందుకు ప్రాజెక్టులు కడుతుందని ఆయన ఆరోపించారు. అదే జరిగితే ఎపిలోని గోదావరి డెల్టా ప్రాంతం పరిస్థితి ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. అందుకే గోదావరి బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావాలని అడుగుతున్నామన్నారు. గోదావరిలో మిగులు జలాలు లేవు, కృష్ణా నది ఎగువ రాష్ట్రాలు ఉపయోగించుకోనందుకే నీళ్లు కిందకి పోతున్నాయి, అందరూ వదిలేసిన నీరు మేము వాడుకుంటున్నాం, వాటిని కూడా లెక్కలోకి తీసుకోవాలనడం అర్ధరహితమని ఆయన పేర్కొన్నారు. గొదవారి నుంచి 241 టింఎంసీల నీరు కృష్ణా బేసిన్‌కు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ సభ్యులు ఎందుకు హాజరుకాలేదో తెలియదని ఆయన పేర్కొన్నారు.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ

మరోవైపు మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. బోర్డు పూర్తిస్థాయి భేటీ జరిగాకే సమన్వయ కమిటీ భేటీ జరగాలని విజ్ఞప్తి చేసింది. సోమవారం గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాసిన విషయం తెలిసిందే. ముందుగా గోదావరి బోర్డు పూర్తిస్థాయి భేటీ జరగాలని ఈఎన్‌సీ ఆ లేఖలో కోరింది. బోర్డు పూర్తిస్థాయి భేటీ తర్వాతే సమన్వయ కమిటీ భేటీ జరగాలని సూచించింది.

5న రాయలసీమ ఎత్తిపోతలనుసందర్శించనున్న కెఆర్‌ఎంబి

ఎల్లుండి రాయలసీమ ఎత్తిపోతలను కృష్ణాబోర్డు ప్రతినిధులు పరిశీలించనున్నారు. ఈనెల 5వ తేదీన కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబీ) ప్రతినిధులు ఎపిలోని రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించనున్నారు. పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పనులను బోర్డు ప్రతినిధులు పరిశీలిస్తారు. ఈ మే రకు కెఆర్‌ఎంబీకి ఎపి ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అయి తే ఈ బృందంలో తెలంగాణకు చెందినవారు ఎవరూ ఉండకూడదని కృష్ణా బోర్డుకు ఎపి ప్రభుత్వం షరతు విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News