Saturday, November 23, 2024

ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

Intinta Innovator poster launched by collector Swetha mahanthi

 

మన తెలంగాణ, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గత మూడు ఏళ్లుగా ప్రతిష్టాత్మకంగా ఇంటింటా ఇన్నోవేషన్ నిర్వహిస్తుంది. ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంతో సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటా ఇన్నోవేటర్‌తో ప్రతి వ్యక్తిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్దులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, వ్యవసాయదారులు, గృహిణులతో పాటు అన్ని రంగాల వారు ఈకార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. విన్నూత ఆలోచనలకు రూపకల్పన చేసి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఆవిష్కరణలు వెళ్లేలా కృషి చేయాలని సూచించారు.

మరో ఆరు రోజులే గడువు 

ఆవిష్కరణలు తమ ఆవిష్కరణకు సంబంధించిన రెండు నిమిషాల వీడియోను, నాలుగు ఫోటోలు ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలతో పాటు ఆవిష్కరణ పేరు, ఫోన్ నంబర్, వయస్సు ప్రస్తుత వృతి, మండలం పేరు, జిల్లా పేరు నమోదు చేయాలి. ఈ వివరాలన్నింటిని వాట్సాప్ నంబర్ 9100678543కు ఈనెల 10వ తేదీలోగా పంపించాలని సూచించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలో ఒకేసారి 15 ఆగస్టు 2021న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్‌లైన్‌లో ఆవిష్కరణలను ప్రదర్శినలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నూతన ప్రయోగాలు, ఆవిష్కరణపై ఆసక్తి ఉన్న వారందరికి చక్కటి అవకాశం మరో ఐదు రోజుల గడువు ఉన్నందుకు ఈసమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సందేహాలుంటే జిల్లా సైన్స్ అధికారులు సీ.ధర్మేందర్‌రావుకు పోన్ చేసిన నివృతి చేసుకోవచ్చన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాదికారి రోహిణీ, జిల్లా సైన్సు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News