Friday, September 20, 2024

ముంబైలో తొలి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Launch of first Genome sequencing lab in Mumbai

 

ముంబై : ముంబై నాయిర్ ఆస్పత్రిలో మొట్టమొదటి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ప్రారంభమైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈ ల్యాబ్‌ను వర్చువల్‌లో ప్రారంభించారు. దీనివల్ల అత్యధిక సంఖ్యలో శాంపిల్స్‌ను తక్కువ సమయంలో పరీక్షించడానికి వీలవుతుంది. అలాగే కొత్తరకం మ్యూటెంట్లను కనుగొని విశ్లేషించ వచ్చు. ముఖ్యంగా హాట్‌స్పాట్ ఏరియాల్లో దీనివల్ల ఉపయోగం ఉంటుందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. టిఎన్ మెడికల్ కాలేజీ మరియు బివైఎల్ నాయిర్ చారిటబుల్ ఆస్పత్రిలో మరో ప్రాజెక్టు స్పిన్జ్ర థెరపీ ని ప్రారంభించారు. ఈ ప్రారంభం సందర్బంగా థాకరే వందేళ్ల చరిత్ర కలిగిన నాయిర్ ఆస్పత్రి స్పానిష్ ఫ్లూ మహమ్మారి వ్యాపించిన సమయంలో ఆనాడు ప్రారంభమైందని చెప్పారు. మరో వందేళ్ల పాటు ప్రజలకు వైద్యసేవ అందించడానికి సిద్ధమైందని ప్రశంసించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News