- Advertisement -
న్యూఢిల్లీ : కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వస్తున్న పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా ఆంక్షలు విధించే విషయాన్ని రాష్ట్రాలు ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈనెల 19 న మొహరంతో ప్రారంభమై అక్టోబర్ 19 దుర్గాపూజ దసరా వరకు వరుసగా పండగలు వస్తాయని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు స్థానికంగా కరోనా కట్టడికి తీసుకోవలసిన చర్యలపై ఆంక్షలపై సమీక్షించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది. పండగల సందర్భంగా జనం గుమికూడడం, గుంపులుగా పండగలు చేసుకోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయని ఫలితంగా వైరస్ తీవ్రంగా వ్యాపించే ముప్పు ఎదురౌతుందని ఐసిఎంఆర్, ఎన్‌సిడిసి సంస్థలు ఆందోళన వెలిబుచ్చాయి. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రులకు, పాలనానిర్వాహకులకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు రాసింది.
- Advertisement -