- Advertisement -
న్యూఢిల్లీ : కొవిషీల్డ్ రెండు డోసులతో కరోనా వైరస్ కట్టడి అవుతుందని, ముఖ్యంగా ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా పెంపొందుతుందని ఐసిఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో కొవిషీల్డ్ రెండు డోసులతో యాంటీబాడీల స్పందనను సమీక్షించారు. కప్పా, లేదా డెల్టా వేరియంట్ వల్ల ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారు కొవిషీల్డ్ మొదటి, రెండు డోసులు తీసుకున్నాక కోలుకున్నట్టు అధ్యయనంలో గమనించారు. ఐదు కేటగిరిల వారీగా అధ్యయనంలో పాల్గొన వారిని విభజించి వారికి డోసులు అందించారు. మొత్తం 116 మందిని అధ్యయనం లోకి తీసుకుని వారిని గ్రూపులుగా విభజించి వివిధ స్థాయిల్లో డోసులు అందించారు.
- Advertisement -