హైదరాబాద్: రూ. 1700 కోట్ల ఫ్రాడ్ కేసులో ఉప్పలపాటి హిమబిందును ఇడి అధికారులు అరెస్ట్ చేశారు. 2018లో విఎంసి సిస్టమ్స్ లిమిటెడ్ ముగ్గురు డైరెక్టర్లపై సిబిఐ కేసు నమోదు చేశారు. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇడి రంగంలోకి దిగింది. నకిలీ పత్రాలతో విఎంసి ప్రైవేటు లిమిటెడ్ పేరుతో బ్యాంకుల్లో రుణాలు పొందినట్లు గుర్తించారు. సదరు కంపెనీ డైరెక్టర్లు హిమబిందు, వెంకటరామారావు, వెంకటరమణపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం డైరెక్టర్లు విచారణకు సహకరించకపోవడంతో హిమబిందును ఇడి అధికారులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు డైరెక్టర్ల కోసం కోస ఇడి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఎస్బిఐ, ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల నుంచి సుమారుగా రూ.1207 కోట్లు, పిఎన్‌బి బ్యాంక్ నుంచి రూ.593 కోట్ల రుణాలు విఎంసి ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంది. 2018లో బిఎస్ఎన్ఎల్ నుంచి రావాల్సిన బకాయిలు వస్తే చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. బిఎస్ఎన్ఎల్ నుంచి రూ.33 కోట్లు బకాయిలు ఉంటే రూ262 కోట్లు రావాల్సి ఉందని సిబిఐని కంపెనీ డైరెక్టర్లు తప్పుదోవ పట్టించారు.