మనతెలంగాణ/హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ఒక గేటు ఎత్తి ప్రాజెక్ట్ నుంచి 2,759 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 5,333 క్యూసెక్కులు కాగా, ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టిఎంసీలు. ప్రస్త్తుతం 19.0362 టిఎంసీలుగా ఉంది.
నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 8 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 1,07,462 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులు ఉంది. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టిఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 310.84 టిఎంసీలుగా ఉంది.
Heavy flood flow into Yellampalli Project