మాస్కో / న్యూఢిల్లీ: అఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత ఘర్షణాయుత పరిస్థితిపై రష్యా ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి రావాలని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తరఫున పాకిస్థాన్, అమెరికా, చైనాలకు ఆహ్వానాలు పంపించారు. అయితే ఈ కీలక భేటీకి భారత్‌ను పిలవలేదు. ఈ పరిణామం దౌత్యవర్గాలలో కీలక అంశం అయింది. అఫ్ఘన్ నుంచి క్రమేపీ అమెరికా ఇతర దేశాల సేనల నిష్క్రమణ జరుగుతోంది. ఈ తరుణంలో అఫ్ఘన్‌లో తాలిబన్లు తమ ఆధిపత్య సాధనకు దాడులు ముమ్మరం చేశారు. పరిస్థితి చేజారిపోతోందని ముందు నుంచి భారతదేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉగ్రవాద సంస్థలు తిరిగి బలోపేతం అయ్యేందుకు ఇక్కడి పరిస్థితులు దోహదం చేస్తాయని తెలిపింది. అంతా స్పందించాలని సూచించింది. ఈ తరుణంలోనే రష్యా జోక్యం చేసుకుని మూడు దేశాలతోనే కీలక భేటీకి ముందుకు వచ్చింది. ఈ నెల 11వ తేదీన ఈ భేటీ ఖతార్‌లో జరుగుతుంది.
India not invited to extended Troika meet