Thursday, December 5, 2024

సంజయ్ దమ్ముంటే… దళిత బంధు కోసం రూ.50 వేల కోట్లు తీసుకురా?

- Advertisement -
- Advertisement -

Balka suman comments on Bandi sanjay

 

హైదరాబాద్: సింగరేణి ఖాళీ స్థలాల్లో జివొ 76 ప్రకారం క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు.   జివొలో మరిన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని తాము కోరామన్నారు. జివొలో సడలింపులు తీస్తే వేలాది మందికి లబ్ధి చేకూరుతుందని, దీనిపై సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించి ఆదేశాలు జారీ చేశారని పొగిడారు. ఇప్పుడు పొజిషన్ లో ఉన్న వారందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, సింగరేణి ప్రాంతంలో నెలకొల్పనున్న వైద్య కళాశాల లో 25 శాతం సింగరేణి కార్మిక కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. 25 శాతం రిజర్వేషన్లపై కూడా సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుటుందని భావిస్తున్నామని బాల్క సుమన్ పేర్కొన్నారు.

త్వరలో కెటిఆర్ ఆధ్వర్యంలో సింగరేణి సమస్యలపై సమీక్ష సమావేశం  ఉంటుందన్నారు. దళిత సాధికారత కోసం బడ్జెట్ లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని,  ఉప ఎన్నికల కోసం తెచ్చిన పథకం కాదన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత దళితుల అభివృద్ధి కోసం ఎన్నోసార్లు మేధావులతో చర్చలు జరిపామని, ఎప్పుడో ప్రారంభం కావాల్సిన న పథకం ఇప్పుడు ప్రారంభమైందన్నారు.  దళిత బందు పథకాన్ని బిజెపి అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దళితులకు వ్యతిరేకమే బిజెపి మూల సిద్ధాంతమని, దళిత ప్రజలకు మంచి చేయాలని బిజెపికి ఆలోచన ఉంటే దమ్ముంటే ఎంపి బండి సంజయ్ దళిత బంధు కోసం కేంద్రం నుంచి 50 వేల కోట్లు రూపాయలు తీసుకరావాలని సవాలు విసిరారు.  దళితులలో మార్పుకోసం ఈ పథకం నాంది పలుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సింగరేణి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాల నేతలు వెంకట్రావ్, మల్లయ్య, రాజి రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News